
అమరావతి, జనవరి 28:-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ (BC Welfare) జాయింట్ కమిటీ సమావేశం ఈరోజు అసెంబ్లీ హాల్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగింది. ఈ సమావేశానికి జాయింట్ కమిటీ చైర్మన్ బీద రవిచంద్ర గారు అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారు, నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు గారు, కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ గారు, పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ గారు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమానికి సంబంధించి అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా బీసీ సంక్షేమ స్కూళ్లు, ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్, తల్లికి వందనం పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు, సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎన్టీఆర్ విదేశీ విద్య పథకం, ఏపీ బీసీ స్టడీ సర్కిల్స్, బీసీ హాస్టల్స్ మరియు రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణాలు, బీసీ భవనాలు, కమ్యూనిటీ హాల్స్, ఎస్.ఆర్. శంకర నాలెడ్జి సెంటర్ల ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు.Amaravathi news
అలాగే బీసీలకు సంబంధించి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు పురోగతిపై కూడా సభ్యులు చర్చించారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి బీసీ కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో శాసనసభ అధికారులు, బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.










