75 లక్షల రూపాయల రహదారులు మరియు గోకులం షెడ్డు లను ప్రారంభించిన మంత్రి నిర్మల రామానాయుడు.

City News Teluguపశ్చిమగోదావరి జిల్లా .. పాలకొల్లుAP NEWS: స్వచ్చాంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి – అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలనతో ముందుకెళ్తున్నాం
పాలకొల్లు నియోజకవర్గంలో చందపర్రు మరియు ఆగరు గ్రామాలలో సుమారు 75 లక్షల రూపాయల రహదారులు మరియు గోకులం షెడ్డు లను ప్రారంభించిన మంత్రి నిర్మల రామానాయుడు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని, ముఖ్యంగా రాష్ట్రంలో గుంతలు, గొయ్యలతో అత్యంత దారుణంగా ఉన్న రహదారులను బాగు చేయడమే కాకుండా, పల్లెల్లో కూడా నూతనంగా సిసి రోడ్లు ఏర్పాటు చేసి అభివృద్ధిలో ముందుకు సాగుతున్నారని తెలిపారు. అంతేకాకుండా రైతులకు అన్ని విధాలా అండగా ఉండాలనే ఉద్దేశంతో వారికి సబ్సిడీతో గోశాల షెడ్లను ఏర్పాటు చేసుకోవడానికి అత్యధికంగా 90 శాతం సబ్సిడీ అందిస్తుందని తెలియజేశారు.








