
న్యూఢిల్లీ: మహిళల వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు జట్టు సభ్యులు వరల్డ్ కప్‌లో తమ అనుభవాలను, విజయ విశేషాలను ప్రధానికి వివరించారు.
వారితో మోదీ ఆత్మీయంగా మాట్లాడి అభినందనలు తెలిపారు. అనంతరం “నమో” అని రాసిన ప్రత్యేక జెర్సీని జట్టు తరఫున ప్రధానమంత్రికి అందజేశారు. ట్రోఫీతో కలిసి ఫోటోలు దిగిన ఈ సందర్భంగా ప్రధాని మహిళా క్రీడాకారిణుల ధైర్యసాహసాలను ప్రశంసించారు.







