
Guntur:మంగళగిరి -తాడేపల్లి: అక్టోబర్ 23:-డతెరపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కమిషనర్ పౌరులకు విజ్ఞప్తి చేశారు.వర్షాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పౌరులకు ముందస్తు సమాచారం అందించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ నంబర్లు 7093912653, 08645-295193 ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, తక్షణ పరిష్కార చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు.భారీ వర్షాల కారణంగా శిథిలావస్థలో ఉన్న గోడలు, పాత భవనాలు కూలే ప్రమాదం, అలాగే కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.ముంపు ప్రాంతాలు లేదా ప్రమాదకర భవనాలు, గోడలు, స్థంభాలు గుర్తించిన వారు సమీప సచివాలయం లేదా నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కమిషనర్ పిలుపునిచ్చారు.
అదేవిధంగా వర్షాకాలంలో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, వైరల్ జ్వరాలు, డయేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం మానుకుని, కాచి వడపోసిన నీరు మాత్రమే త్రాగాలని సూచించారు.సీజనల్ వ్యాధుల లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని హెల్త్ సెంటర్ ను సంప్రదించాలన్నారు. అవసరమైన మందులు, టెస్టులు హెల్త్ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కమిషనర్ తెలిపారు.







