chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍కృష్ణా జిల్లా

భారత ఉపరాష్ట్రపతి పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు

మచిలీపట్నం, సెప్టెంబర్ 22:ఈనెల 24వ తేదీన జిల్లాలో పర్యటించనున్న గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్ పర్యటనను దృష్టిలో ఉంచుకొని భద్రతా ఏర్పాట్లపై జిల్లా అధికారులు, కేంద్ర భద్రతా దళాల మధ్య సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఏ విషయంలోనూ లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంపూర్ణ పర్యవేక్షణ అధికారి, సిఆర్‌పిఎఫ్ డీఐజీ కమలేష్ సింగ్ ఆదేశించారు.

సోమవారం ఉదయం ఆయన నేతృత్వంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన (ASL) భద్రతా సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీఐజీ హఫీజ్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, విమానాశ్రయం డైరెక్టర్ ఎమ్.ఎల్.కె. రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి రాకపోకలు, స్వాగత కార్యక్రమాలపై వారు సమీక్షించి, సంబంధిత ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమలేష్ సింగ్ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పర్యటన సమయంలో రోడ్ మాపింగ్, విమానాశ్రయం పరిసరాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ వంటి ప్రత్యేక బలగాలను సిద్ధంగా ఉంచాలన్నారు. రాష్ట్ర పోలీసు విభాగంతో పాటు కేంద్ర బలగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ 24వ తేదీన సాయంత్రం 4:20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, 5:00 గంటలకు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ దర్శనానికి విజయవాడ చేరుకుంటారని తెలిపారు. అనంతరం 5:40కి పున్నమి ఘాట్ సందర్శించి, రాత్రి 7:20 గంటలకు తిరుపతి బయలుదేరుతారని వెల్లడించారు.

ఉపరాష్ట్రపతికి ఆహ్వానం పలికే ప్రముఖుల జాబితాను ముందుగా సిద్ధం చేయాలని, వారికి మంచినీరు, గ్రీన్‌రూమ్ వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఉపరాష్ట్రపతికి పోలీస్ గౌరవ వందనం ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాటు చేయాలని సూచించారు.

ఆయన పర్యటన దృష్ట్యా పిన్నమనేని ఆసుపత్రిని సురక్షిత ఆసుపత్రిగా, గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిని కంటిన్యూజెన్సీ ఆసుపత్రిగా సిద్ధం చేయాలని తెలిపారు. రక్తపు గ్రూపులు, అంబులెన్సులు, అవసరమైన మందులు, డ్రైవింగ్‌కు వాహనాల స్థితిగతుల పరిశీలన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

విమానాశ్రయం చుట్టుపక్కల డ్రోన్ల ఎగరడాన్ని నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాములు ప్రవేశించకుండా పాములు పట్టే నిపుణులను సిద్ధంగా ఉంచాలన్నారు.

ఉపరాష్ట్రపతికి సంబంధించిన మార్గాల్లో వీధిదీపాలు వెలిగేలా చూసి, రహదారులపై గుంతలు లేకుండా మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం తరపున విధులు నిర్వహించే ఉద్యోగులకు డ్యూటీ పాసులు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో సిఆర్పిఎఫ్ కమాండెంట్ ధర్మబీర్ జకర్, అసిస్టెంట్ కమాండెంట్ తేజ్ బహదూర్, డిపిఓ డాక్టర్ జె. అరుణ, డిఎస్ఓ మోహన్ బాబు, డిఎం శివరాం ప్రసాద్, డీఎంఅండ్ హెచ్‌వో డాక్టర్ ఏ. వెంకట్రావు, డిటిఓ శ్రీనివాస్, తాడిగడప మున్సిపల్ కమిషనర్ నజీర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధర్ రావు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏ. సురత్నం, గన్నవరం ఎంపీడీవో స్వర్ణలత, తహసిల్దారు శివయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker