Bhasym premier cricket league : ఇండియాకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగాలి- సిఐడి ఎస్పీ సరితా.
Bhashyam ప్రీమియర్ క్రికెట్ లీగ్
భాష్యం విద్యాసంస్థల నుండి క్రికెట్ నేర్చుకొని భారత్ క్రికెట్ టీమ్ కు దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగాలని జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సంకల్ప బలంతో లక్ష్యాలను సాధించాలని సిఐడి ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎస్పీ సరిత అన్నారు
సోమవారం భాష్యం విద్యాసంస్థల ఆధ్వర్యంలో భాష్యం రామసేతు క్యాంపస్ సమీపంలో జెఎస్ఆర్ స్పోర్ట్స్ అకాడమీ లో జరుగుతున్న భాష్యం ప్రీమియర్ లీగ్ సెంట్రల్ లెవెల్ టి20 క్రికెట్ టోర్నమెంట్ భాగంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్పి సరిత లాంచనంగా ప్రారంభించారు. భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో సైతం నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఈ భాష్యం ప్రీమియర్ లీగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఫైనల్స్ 26వ తేదీన నిర్వహించడం జరుగుతుందని రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు భాష్యం విద్యాసంస్థల ముత్య సలహాదారు మైకేల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు