హైదరాబాద్, బషీర్‌బాగ్ :25 09 25 :తెలంగాణ రాష్ట్ర సంప్రదాయాన్ని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించామని హైదరాబాద్ డీఈవో రోహిణి తెలిపారు. బషీర్‌బాగ్‌లోని డీఈవో కార్యాలయంలో గురువారం జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఆమె పాల్గొన్నారు.
తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మను మహిళా ఉద్యోగులతో కలిసి ఆమె చుట్టూ తిరుగుతూ ఆటల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ మహిళల ఏకత్వానికి, సాంస్కృతిక విలువలకు ప్రతీకగా నిలుస్తుందని డీఈవో రోహిణి పేర్కొన్నారు.
పూలతో తయారైన బతుకమ్మ అందరినీ ఆకట్టుకోగా, కార్యాలయవాతావరణం ఉత్సాహభరితంగా మారింది.