Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Accelerated Land Acquisition: 10X Secrets to District Development||Bhusekarana వేగవంతం: జాతీయ రహదారులు, రైల్వేల ప్రాజెక్టులకు 10X అభివృద్ధి

Accelerated Land Acquisition: 10X Secrets to District Development||Bhusekarana వేగవంతం: జాతీయ రహదారులు, రైల్వేల ప్రాజెక్టులకు 10X అభివృద్ధి

జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులకు భూ సేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులకు పలు సూచనలు చేశారు.

సోమవారం, జాతీయ రహదారుల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ స్థానిక కలెక్టరేట్ లోని వీక్షణ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాపట్ల జిల్లా లో వెళ్లే జాతీయ రహదారులు 544జి,167ఎ,16,544డి ప్రాజెక్టు పనులను పూర్తి చేయుటకు కావలసిన భూసేకరణలో ఉండే సమస్యలను త్వరితగతిన పరిష్కరించి జాతీయ రహదారుల పురోగతిని మెరుగుపరిచే విధంగా అధికారులు పనిచేయాలని ఆయన అన్నారు. ప్రతి వారం రహదాలకు సంబంధించి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. బాపట్ల జిల్లాకు ప్రాధాన్యత ఇస్తూ పనులను త్వరగా పూర్తి చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని ఆయన జాతీయ రహదారుల అధికారులకు తెలిపారు.

బాపట్లలో రైల్వే ట్రాక్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు కావలసిన భూసేకరణ విషయమై జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆరా తీశారు. భూ సేకరణకు సంబంధించి రెవిన్యూ అధికారులు, రైల్వే అధికారులు సంయుక్తంగా స్థల పరిశీలన చేసి నివేదిక అందజేయాలని ఆయన అధికారులకు సూచించారు. బాపట్లలో రైల్వే స్టేషన్ పరిసరాల అభివృద్ధికి సంబంధించి స్థల సేకరణ విషయంలో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఆయన రైల్వే అధికారులకు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, ల్యాండ్ ఎక్విజిషన్ సెక్షన్ సూపర్డెంట్ శ్రీలక్ష్మి, వీక్షణ సమావేశం ద్వారా బాపట్ల, చీరాల రెవెన్యూ డివిజన్ అధికారులు గ్లోరియా, చంద్రశేఖర్, అద్దంకి, జే పంగులూరు, చీరాల, పర్చూరు, కారంచేడు తాహాసిల్దార్లు, జాతీయ రహదారులు మరియు రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button