
బాపట్ల:12-12-25:- నియోజకవర్గం కర్లపాలెం మండలం బిడారుదిబ్బ గ్రామంలో హోప్ ఫాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమా క్రిస్మస్ కార్యక్రమం శుక్రవారం గ్రామంలో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, పిల్లలు, మహిళలు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాపట్ల నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు గారు విచ్చేసి పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్బంగా పిల్లలకు మరియు గ్రామ ప్రజలకు నూతన వస్త్రాలను పంపిణీ చేసి, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ—గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలు ముందుకు రావడం ఆనందకరమని, ప్రతి పండుగలో అందరికీ సమానంగా సంతోషాన్ని పంచడం మన బాధ్యత అని తెలిపారు.
Bapatla Local News ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని, బిడారుదిబ్బ గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా తోడుంటామని చెప్పారు.బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు మాట్లాడుతూ—సేవే మానవత్వం అన్న భావంతో హోప్ ఫాస్టర్ ఫెలోషిప్ చేస్తున్న సేవలు ప్రశంసనీయం అని అన్నారు. పండుగలు ప్రీతి, ప్రేమ, స్నేహానికి ప్రతీకలని, సమాజంలో ఐక్యతను బలపరుస్తాయని పేర్కొన్నారు. హోప్ ఫాస్టర్ ఫెలోషిప్ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు పాల్గొన్నారు. పిల్లలు క్రిస్మస్ ప్రత్యేక గీతాలు పాడి కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచారు.







