
ప్రచురణార్థం 16-11-2025

బిరసా ముండా జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరించిన ఎంపీ కేశినేని శివనాథ్
చిరస్మరణీయుడు భగవాన్ బిరసా ముండా ఎంపీ కేశినేని వెల్లడి
విజయవాడ : గిరిజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరించటం చాలా ఆనందంగా వుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. బిర్సా ముండా 150 జయంతిని పురస్కరించుకుని తెలుగులో ముద్రించిన డాక్టర్ మోహన్ భాగవత్ రాసిన భగవాన్ బిరసా ముండా జీవిత చరిత్ర పుస్తకాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ ఆవిష్కరించారు.
గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా టిడిపి నాయకులు, నేషనల్ కమీషన్ మాజీ మెంబర్ మాదిగాని గురునాథం బిర్సా ముండా చిత్ర పటాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ కు బహుకరించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ భగవాన్ బిర్సా ముండా చిరస్మరణీయుడన్నారు.
బిట్రీష్ వారిపై బిర్సాముండా చేసిన పోరాటాలు గిరిజనుల్లో చైతన్యం నింపి ఆదీవాసులకు ఆరాద్య దైవంగా మారాడన్నారు. బిర్సా ముండా గిరిజనుల హక్కుల కోసం, గిరిజన జాతుల ఆచారాలు, సాంఘిక విలువలకు గౌరవం తీసుకురావటం కోసం పోరాడారని తెలిపారు. బిర్సా ముండా పోరాటము సత్యం, న్యాయం, లక్ష్యాలుగా సాగిందన్నారు. జనజాతీయ గౌరవ దివస్ వల్ల బిర్సా ముండా లాంటి ఎంతో మంది గిరిజన వీరుల గాథలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. ప్రాచుర్యంలో లేని గిరిజన చరిత్రికు ప్రాధాన్యత లభించిందన్నారు
ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు వి. నరసింహా చౌదరి, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు కరీముల్లా పాల్గొన్నారు.







