
MLC ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార (పిజీఆర్ఎస్) కార్యక్రమం తాత్కాలికంగా రద్దు. గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్నందున జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం”ను రద్దు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లా పోలీస్ కార్యాలయంలో అర్జీలు ఇవ్వదలచుకున్న ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.







