
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్యాలయం వద్ద ఉన్న పూల మొక్కలు గార్డెన్ లో నిప్పుఅంటుకొని మంటలు రావడం జరిగినది. ఈ ఘటనలకు సంబంధించి కార్యాలయం వారు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరపడానికి వారిని కార్యాలయం ముందు ఉన్న సీసీటివి ఫూటేజ్ అడగడం జరిగిందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సీసీటివి ఫూటేజ్ అడగడం పట్ల పలువురు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి కార్యాలయం ముందు ఉన్న సీసీ కామెరాల ఫూటేజ్ అడగడం జరిగినది ఎందుకంటే ఆ సమయాల్లో అక్కడ ఎవరెవరు వ్యక్తులు తిరుగుతున్నారో, ఆ రోజు కార్యాలయానికి ఎవరెవరు వ్యక్తులు వచ్చారో పరిశీలించడానికి. కార్యాలయానికి దగ్గరలోని సీసీటివి కెమెరాలను పరిశీలించినప్పుడు మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కనుక కార్యాలయం ముందు సీసీటివి ఫూటేజ్ అడగడం జరిగింది. ఫిర్యాదు ఇచ్చినప్పుడు కొన్నిసార్లు ఫిర్యాదు దారుల దగ్గర ఉన్న ఆధారాలు కూడా ఇస్తే కేసును త్వరగా దర్యాప్తు చేయగలుగుతాము. ఈ నేపథ్యంలో సిసిటివి ఫుటేజీ అడగడం జరిగినది. మాజీ ముఖ్యమంత్రి కార్యాలయం అనేది హై సెక్యూరిటీ జోన్ కావున సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి త్వరగా కేసు దర్యాప్తు చేస్తాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకుంటామని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు.







