
విజయవాడ వైఎస్సార్సీపీ నేతలు, కార్పొరేటర్లతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పార్టీ నేతలతో ఆయన తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈసారి జగన్ 2.0ను చూడబోతున్నారు.. ఈ 2.0 వేరేగా ఉంటుంది” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తా. తొలివిడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డాను. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను. ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశాను. ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి చట్టం ముందు నిలబెడతా. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తాం” అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.







