మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కు అవమానం జరిగింది. సాక్షాత్తు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎక్కడా ఎన్టీఆర్ బొమ్మ కనిపించలేదు. దీంతో కార్యక్రమానికి హాజరైన టిడిపి నేతలు, కార్యకర్తలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఎన్టీఆర్ బొమ్మ లేని ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టిడిపి నేతలు అప్రమత్తమయ్యారు. కార్యాలయ నిర్వాహకులు వెంటనే స్పందించి తాత్కాలికంగా ఎన్టీఆర్ ఫోటోని పెట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సాక్షాత్తు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ బొమ్మ లేకుండా ఫ్లెక్సీలు వేయడం పట్ల ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
251 Less than a minute