ఆంధ్రప్రదేశ్
మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు, చరణ్ తేజ , రాజా రమేష్.
పల్నాడు జిల్లా, చిలకలూరిపేట
చిలకలూరిపేట: పట్టణంలోని 25 వ వార్డు జాగు పాలెం నందు గల మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఆదివారం అన్న సంతర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలు గత మూడు రోజులుగా జరుగుతున్నాయి. ఈరోజు కార్యక్రమంలో జనసేనయువ నాయకులు, మండలనేని చరణ్ తేజ పాల్గొని అన్నసంతర్పణ కార్యక్రమం స్వయంగా పర్యవేక్షించారు. వారితోపాటు నియోజకవర్గం జనసేన పార్టీసమన్వయ కర్త తోట రాజా రమేష్, పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వార్డుకు సంబంధించిన కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.