BREAKING NEWS – GUNTUR: గుంటూరు నగరపాలక సంస్థపై ఎగిరిన టీడీపీ జెండా
TDP WINNING CORPORATION ELECTION
ఉత్కంఠ భరితంగా సాగిన నగరపాలకసంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అధికార కూటమి విజయం సాధించింది. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మొత్తం ఆరుగురు కూటమి సభ్యులు విజయం సాధించారు. టిడిపి తరఫున ఐదుగురు, జనసేన తరఫున మరో కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా గెలుపొందారు. నగరపాలక సంస్థలో 57 డివిజన్లకు గాను 46 డివిజన్లో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు విజయం సాధించారు. అందులో ఒక కార్పొరేటర్ మరణించగా 45 మంది వైసీపీ కార్పొరేటర్ లు ఉన్నారు అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో కొందరు కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశంలో చేరారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా మరికొందరు వైసీపీ కార్పొరేటర్లు టిడిపిలో చేరారు. ఈ నేపథ్యంలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎట్టకేలకు కూటమి సభ్యులు విజయం సాధించారు. ఇందులో ఈరంటి వరప్రసాద్ కి 33 ఓట్ల రాగా నూకవరపు బాలాజీ, కొమ్మినేని కోటేశ్వరరావు, ముప్పవరపు భారతి, మీరావాలి, జనసేన తరఫున లక్ష్మీ దుర్గ గెలుపొందారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల వివరాలను నగర కమీషనర్ పులి శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. గెలుపొందిన కార్పోరేటర్లకు డిక్లరేషన్ ఫారంలను అందజేశారు. ప్రశాంత వాతావరణంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పూర్తయ్యే విధంగా సహకరించిన వారికి కమిషనర్ ధన్యవాదాలు తెలిపారు.