అనంతపురం శిశుగృహంలో పసికందు మృతి ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ స్పందిస్తూ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన బాధాకరమని పేర్కొన్న కలెక్టర్ వెంటనే త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీలో డిఎంహెచ్ఓ డాక్టర్ ఈ.బి. దేవి, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగమణి, జిజిహెచ్ పీడియాట్రిక్ హెచ్‌ఓడి సభ్యులుగా ఉన్నారని వివరించారు. కమిటీ సమగ్ర విచారణ జరిపి పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించినట్టు చెప్పారు. కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై తప్పక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్ష కొనసాగుతోందని ఆయన తెలిపారు.