ఎగువ రాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులకి వరద ఉధృతంగా వచ్చి చేరుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. వరద ప్రవాహ హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తూ కృష్ణా, గోదావరి పరివాహక జిల్లాల్లోని క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభావిత జిల్లాల్లో అత్యవసర సహాయక చర్యల కోసం 5 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించినట్లు వెల్లడించారు.
ప్రజలు వరద సమాచారం, సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలన్నారు. వినాయక నిమజ్జన సమయంలో నదీ, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా పాటించాలన్నారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని సూచించారు. రేపు మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.
గురువారం సాయంత్రం 6 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది వరద ప్రవాహం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4.43 లక్షల క్యూసెక్కులు ఉందని, మొదటి హెచ్చరిక కొనసాగుతుందని తెలిపారు.
శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 2.38, ఔట్ ఫ్లో 3.21 లక్షల క్యూసెక్కులు
నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 3.18, ఔట్ ఫ్లో 2.46 లక్షల క్యూసెక్కులు
పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 2.70, ఔట్ ఫ్లో 2.74 లక్షల క్యూసెక్కులు ప్రవాహం ఉందన్నారు.
మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 38.6 అడుగులు అందని పేర్కొన్నారు. ధవళేశ్వరం వద్ద సాయంత్రం 6 గంటలకు ఇన్ ఫ్లో 5.31, ఔట్ ఫ్లో 5.30 లక్షల క్యూసెక్కులు ఉందని, శనివారం ఉదయానికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి,ఆదివారంలోపు దాదాపు రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు వరద ప్రవాహం చేరే అవకాశం ఉందన్నారు.
నదుల ప్రవాహంతో వివిధ ప్రాజెక్టులలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున ఆయా నదీపరీవాహక ప్రాంత, లోతట్టు గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని చెప్పారు
Breaking news: Flood Alert: For flood information and assistance to the public, Disaster Management: Control Room Toll Free Numbers 112, 1070, 18004250101
Due to the heavy rains in the upper states, the flood will reach the Krishna and Godavari rivers in a strong manner, said Prakhar Jain, Managing Director of the Disaster Management Authority. He said that the field officers in the Krishna and Godavari catchment districts are being alerted by monitoring the flood flow fluctuations. It was revealed that 5 SDRF teams have been sent for emergency relief operations in the affected districts.
People should contact the Control Room Toll Free Numbers 112, 1070, 18004250101 of the Disaster Management Authority for flood information and assistance. It is mandatory to follow the warning boards at the rivers and canals during the Ganesha immersion. It is advised not to go swimming or bathing in the flood water. Prakhar Jain said that there is a possibility of light to moderate rains in Manyam, Alluri, Konaseema, East Godavari, West Godavari and Eluru districts tomorrow.
As of 6 pm on Thursday, the inflow and outflow of the Krishna river at Prakasam Barrage was 4.43 lakh cusecs, and the first warning will continue.
At Srisailam Dam, the inflow is 2.38 lakh cusecs, the outflow is 3.21 lakh cusecs
At Nagarjunasagar, the inflow is 3.18 lakh cusecs, the outflow is 2.46 lakh cusecs
At Pulichintala, the inflow is 2.70 lakh cusecs, the outflow is 2.74 lakh cusecs.
On the other hand, the water level of Godavari at Bhadrachalam has not reached 38.6 feet. At Dhavaleswaram, the inflow was 5.31 lakh cusecs and the outflow was 5.30 lakh cusecs at 6 pm, and the flood flow is likely to reach the first danger warning level by Saturday morning and almost the second danger warning level by Sunday.
Since water is being released downstream in various projects due to the flow of rivers, the people of the river basins and low-lying villages should take appropriate precautions. They said that no attempt should be made to cross streams and canals.