

బి.ఎస్.ఎన్.ఎల్ సంస్థ సిఎమ్.డి శ్రీ
ఎ.రాబర్ట్ జెరార్డ్ రవి శుక్రవారము నాడు విజయవాడ వచ్చారు. అందులో భాగముగా, రాష్ట్రములో ఉన్న వివిధ అధికారుల తో సర్కిల్ కార్యాలయము లో సమీక్ష నిర్వహించారు.
స్వదేశీ 4G ప్రారంభము తరువాత, రాష్ట్రములో చేపట్ట వలసిన వివిధ విధి విధానముల గురించి వివరముగా తెలియ చేశారు.
ముఖ్యముగా, రాష్ట్రములో సరికొత్త టవర్స్ ను ప్రారంభించిన దరిమిలా మరియు ఆకర్షణీయమైన టారిఫ్ తో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించ వలెను అని తెలియ పరిచారు.
అంతే కాకుండా, బి.ఎస్.ఎన్.ఎల్ వద్ద ఉన్న నాణ్యమైన స్పెక్ట్రమ్ తో పాటుగా ఫైబర్ వంటి వనరులు ఉన్నందున, ఆయా సేవలను వినియోగించుకునే సంబంధిత కార్పొరేట్ సంస్థల ను కలిసి వారికి టెలికామ్ సేవలు అందించడం తో, సేవల యొక్క నాణ్యత ను మరింత పెంచ వలెనని తెలియ చేశారు.

ఆ తరువాత, బి.ఎస్.ఎన్.ఎల్. లో, సరికొత్త సర్వీసు అయిన, “వాయిస్ ఓవర్ వై- ఫై” సేవల ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సేవల తో, బి.ఎస్.ఎన్.ఎల్. వినియోగదారులు ఏదేని ప్రదేశము లో టవర్ నెట్వర్క్ లేనప్పటికీ, అక్కడ ఉన్న వై ఫై జోన్ ద్వారా వాయిస్ సేవలు పొందవచ్చును.
ఆ తరువాత,విజయవాడ నుండి అమరావతి రోడ్ మార్గములో బి.ఎస్.ఎన్.ఎల్. నెట్వర్క్ ను పరిశీలించే డ్రైవ్ టెస్ట్ ను నిర్వహించి ఎక్కెడెక్కడయితే నెట్వర్క్ బలహీనంగా ఉన్నదో అక్కడ అవసరమైన చర్యలు తీసుకొని నెట్వర్క్ యొక్క లభ్యత ను పెంపొందించే చర్యలు చేపట్ట వలెనని ఆదేశించారు.








