ఆంధ్రప్రదేశ్పల్నాడు

ఉచిత పశు వైద్య శిబిరాలను రైతులు వినియోగించుకోవాలి : డాక్టర్ దిలీప్

ఉచిత పశు వైద్య శిబిరాలను రైతులు వినియోగించుకోవాలి

కారంపూడి మండలంలోని స్థానిక పట్టణం లో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ దిలీప్ సోమవారం ఉచిత పశువైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కారంపూడి సర్పంచ్ సరస్వతి- బాలు నాయక్, కటికల బాలకృష్ణ, తండా మస్తాన్ జానీ పాల్గొన్నారు.. అనంతరం డాక్టర్ దిలీప్ పశువులను పరీక్షించి, ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి వచ్చే ఈనెల 31వ తేదీ వరకు ఈ శిబిరాలు జరుగుతాయన్నారు. మండలంలో రోజుకు ఒక గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి పశువులు పెంచుకునే రైతులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పశు వైద్య సిబ్బంది,బోగ్గరపు . బ్రహ్మం పాల్గొన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker