Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్జాతీయ వార్తలుతెలంగాణ
Trending

Canada news: తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి వేడుకలు.

తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ‘తీన్మార్ సంక్రాంతి’గా మైఖేల్ పవర్ సెకండరీ స్కూల్, ఎటోబికో లో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలను కమిటీ కార్యదర్శి  శ్రీ శంకర్ భరద్వాజ పోపూరి గారు ప్రారంభించగా, శ్రీమతి గుప్తేశ్వరి వాసుపిల్లి , శ్రీమతి పద్మజ వరదా , శ్రీమతి సమత కాకర్ల , శ్రీమతి కస్తూరి ఛటర్జీ మరియు శ్రీమతి మాధురి చాతరాజు జ్యోతి ప్రజ్వలన చేయగా, శ్రీతన్ పూల మరియు ఆర్యన్ పూల గణేష వందనంతో సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు.

Canada news: తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి వేడుకలు.

ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీస్ మరియు వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.

Canada news: తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి వేడుకలు.

ఈ కార్యక్రమంలో ఫ్యాన్సీ డ్రెస్, డ్రాయింగ్, ముగ్గులు మరియు వంటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలనుమ్ శ్రీమతి గుప్తేశ్వరి వాసుపిల్లి పర్యవేక్షించారు.

కార్యక్రమంలో భాగంగా వందమందికి పైగా చిన్నారులకు భోగి పళ్లు పోసి ఆశీర్వచనాలను అందించారు. అలాగే TCA స్పాన్సర్ NCPL అధినేత శ్రీ రాంబాబు వాసుపిల్లి చే 2025 టోరెంటో తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించి ముందుగా కమిటీ సభ్యులకు అందజేశారు

Canada news: తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి వేడుకలు.

తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం మూలంగా తెలంగాణ పండుగలని మరియు సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి ముందుకు తీసుకు వెళ్లడానికి  దోహదం చేస్తాయి అని వ్యక్తీకరించారు.   శ్రీ శ్రీనివాస్ మన్నెం గారు ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా  ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవముతో’ అనే విధముగా తెలంగాణ కెనడా అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు.

తీన్మార్ సంక్రాంతి ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీమతి శ్రీరంజని కందూరి గారు, శ్రీ  రాహుల్ బాలనేని మరియు శ్రీమతి మాధురి చాతరాజు నాలుగు గంటల పాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమానికి ఈవెంట్ స్పాన్సర్గా వ్యవహరించిన NCPL అధినేత శ్రీ రాంబాబు వాసుపిల్లి ని తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మన్నెం ను శాలువాతో సత్కరించి TCA మొమెంటో బహుకరించారు.

Canada news: తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి వేడుకలు.

ఈ ఉత్సవానికి వివిధ విభాగాలలో పోటీలకు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. వేడుకలో గెలిచిన వారందరికీ చివరిలో బహుమతులు అందజేశారు. ఫ్యాన్సీ డ్రెస్ బహుమతి స్పాన్సర్గా వ్యవహరించిన విభూతి ఫాబ్ స్టూడియో వారిని తెలంగాణ కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మన్నెం శాలువాతో సత్కరించి TCA మొమెంటో బహుకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు TCA లోకల్ బిజినెస్ లని కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా విభిన్నమైన విక్రేత స్టాల్స్ ఈ కార్యక్రమంలో ఏర్

Canada news: తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి వేడుకలు.

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షుడు శంతన్ నారెళ్ళపల్లి, కార్యదర్శి భరద్వాజ పోపూరి,  సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు, సంయుక్త కార్యదర్శి శ్రీ ప్రణీత్ పాలడుగు, కోశాధికారి శ్రీ రాజేష్ అర్ర, సంయుక్త కోశాధికారి శ్రీ నాగేశ్వరరావు దలువాయి, డైరెక్టర్లు శ్రీమతి శ్రీరంజని కందూరి, శ్రీ కోటేశ్వర్ చెటిపెల్లి, శ్రీ శరత్ యరమల్ల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ శ్రీ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు శ్రీ రాహుల్ బాలనేని, శ్రీ పవన్ కుమార్ పెనుమచ్చ, శ్రీ రాము బుధారపు, శ్రీమతి మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్  శ్రీ హరి రావుల్, వ్యవస్థాపక సభ్యులు శ్రీ దేవేందర్ రెడ్డి గుజ్జుల, శ్రీ కోటేశ్వర రావు చిత్తలూరి, శ్రీ అతిక్ పాషా, శ్రీ కలీముద్దీన్ మొహమ్మద్, శ్రీ అఖిలేష్ బెజ్జంకి, శ్రీ శ్రీనివాస తిరునగరి, శ్రీ సంతోష్ గజవాడ, శ్రీ వేణుగోపాల్ రోకండ్ల, శ్రీ ప్రభాకర్ కంబాలపల్లి, శ్రీ విజయ్ కుమార్ తిరుమలపురం మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

తెలంగాణ కెనడా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీ శంతన్ నారెళ్ళపల్లి గారి కృతజ్ఞతా వందన సమర్పణతో సంక్రాంతి వేడుకలను ఘనంగా ముగించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button