
అమరావతి:28-11-25:- ఆంధ్రప్రదేశ్ క్యాష్యూ మాన్యుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, జీడిపప్పు పరిశ్రమపై అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ (AMC) విధానాల వలన ఎదురవుతున్న కీలక సమస్యలను వివరించారు.ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు మేడూరి ఫణి రాఘవులు, మల్లాకన్నన్, ప్రత్తి వెంకట సుబ్బారావు, చుండూరి వెంకట రమణ సుబ్బరాయులు, మారుతి, పార్థ తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతినిధులు వివరంగా వివరిచేయగా, వాటిని సీఎం శ్రద్ధగా విని సమగ్రంగా పరిశీలించి అవసరమైన సానుకూల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తరువాత వేటపాలెం దత్తక్షేత్రం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ప్రతినిధులు ముఖ్యమంత్రికి అందజేశారు. దత్తక్షేత్ర కార్యక్రమాల వివరాలను తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.







