
గుంటూరు, జనవరి 22 :-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన 14 వేల సిసిటివి కెమెరాలన్నీ నిరంతరం సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారులను ఆదేశించారు. ముఖ్య కూడళ్ళు, ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలు, ప్రజా ప్రాధాన్యత ఉన్న చోట్ల ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

సిసిటివి ప్రాజెక్టు అమలు, డాక్యుమెంట్ అప్లోడ్ ఫర్ ఏజెంట్ స్పేస్, పాజిటివ్ పబ్లిక్ పెర్సెప్షన్ అంశాలపై గురువారం ఎపి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణకు సిసిటివి కెమెరాలు కీలకంగా మారాయని అన్నారు. Guntur Local newsనేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టే దిశగా రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంతో అనుసంధానించి సిసిటివి వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి. ప్రసూన, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె. మయూరి, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి పి. మురళీధర్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి పార్థసారథి, ఎం.టి.ఎం.సి అదనపు కమిషనర్ హేమ మాలిని తదితరులు పాల్గొన్నారు.










