
బాపట్ల, జనవరి 29 :-ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు కచ్చితంగా పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని మోటారు వాహనాల తనిఖీ అధికారిణి ఎన్. ప్రసన్న కుమారి స్పష్టం చేశారు.
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ అధికారి టి.కె. పరంధామ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రసన్న కుమారి మాట్లాడుతూ, యువత రోడ్డు ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్నారని, దీనికి ప్రధాన కారణం రోడ్డు నియమాలను పాటించకపోవడమేనని తెలిపారు. విద్యార్థులు ప్రమాదాల బారిన పడితే వారి విలువైన భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 18 సంవత్సరాలు పూర్తయ్యే వరకు, డ్రైవింగ్ లైసెన్స్ పొందే వరకు వాహనాలను నడపవద్దని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సైకాలజిస్ట్ శ్రీమన్నారాయణ మాట్లాడుతూ, మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. అలాగే సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని విద్యార్థులకు అవగాహన కల్పించారు.Bapatla Local News
మెడికల్ ఆఫీసర్ ఎ. నరేంద్ర కుమార్ ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన ఫస్ట్ ఎయిడ్ చర్యలపై వివరించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బి. కిషోర్ బాబు, బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి. నిరంజన్ బాబు, కళాశాల సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.










