
గుంటూరు జిల్లా:15-10-25:- మోతడకలోని చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాజీ రాష్ట్రపతి డా. ఏ.పి.జే. అబ్దుల్ కలాం జయంతి పురస్కరించుకుని అక్టోబర్ 14, 15 తేదీలలో జాతీయస్థాయిలో “ఫ్యూచర్ ఎక్స్ 2025” (Future X 2K25) టెక్ ఫెస్ట్‌ను ఘనంగా నిర్వహించారు. డేటా సైన్స్ స్టూడెంట్స్ అసోసియేషన్ మరియు ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (IIC) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ టెక్ ఫెస్ట్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 27 ఇంజనీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థినీ విద్యార్థులు హాజరై, సాంకేతిక పోటీలు, ఫన్ గేమ్స్, ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ వంటి విభిన్న కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు, మెమెంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల చైర్మన్ వై.వి. ఆంజనేయులు మాట్లాడుతూ, “భారత మిసైల్ మాన్‌గా పేరుగాంచిన అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు మరువలేనివి. ఐక్యరాజ్య సమితి ఆయన జయంతిని ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ప్రకటించడాన్ని గుర్తుచేసుకుంటూ, విద్యార్థులు ఆయనను ఆదర్శంగా తీసుకుని సాంకేతికతలో కొత్త ఆవిష్కరణలకు పూనుకోవాలి” అని అన్నారు. స్టార్టప్ సంస్కృతి నేపథ్యంలో విద్యార్థులు నూతన ఆలోచనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. కొల్లా నాగ శ్రీనివాసరావు, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. వి.వి. సుబ్బారావు, ఆర్ అండ్ డీ డీన్ డా. పి. బాల మురళికృష్ణ, కార్యక్రమ నిర్వాహకులు వి. సాయి శ్రీనివాస్, ఐఐసి కోఆర్డినేటర్ శాంతి ప్రియతో పాటు విభాగాధిపతులు జి. రామచంద్రరావు, కళ్యాణ్ కుమార్, రత్నబాబు, తులసి రాణి, శంకరరావు, నాగ రవి కిరణ్, హనుమత్ నాయక్, శ్రీకాంత్, గాంధీ తదితరులు పాల్గొన్నారు.






