
గుంటూరు, అక్టోబర్ 15:గుంటూరు జిల్లా చలపతి ఇంజినీరింగ్ కాలేజీలో టెక్ ఫెస్ట్ – 2K25 మంగళవారం ఘనంగా జరిగింది. విద్యార్థుల సృజనాత్మకత, సాంకేతిక ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
👉ఇదిచదవండిఆరోగ్యానికి విటమిన్ సీ ప్రాముఖ్యత||Importance of Vitamin C for Health
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజ్ఞాన యూనివర్సిటీ నుండి స్ట్రాటజీ డైరెక్టర్ శ్రీ ఎన్. చందన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “టెక్ ఫెస్టులు విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలను పెంపొందిస్తాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజాభివృద్ధి దిశగా ఉపయోగించుకోవడంలో ఇవి దోహదపడతాయి” అని అన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. చంద్రశేఖర్ మాట్లాడుతూ, “విద్యార్థులు సిద్ధాంత జ్ఞానంతో పాటు ప్రాక్టికల్ అనుభవం కూడగట్టుకోవాలి. ఇలాంటి టెక్ ఫెస్టులు విద్యార్థుల ప్రతిభను వెలుగులోకి తీసుకువస్తాయి. ప్రతి విద్యార్థి తన సృజనాత్మకతను అభివృద్ధి చేసుకోవడానికి ఇలాంటి వేదికలు చాలా ఉపయోగపడతాయి” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు, మోడల్స్ ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకున్నాయి. మొత్తం 600 మంది విద్యార్థులు వివిధ విభాగాల పోటీలలో పాల్గొన్నారు.
కార్యక్రమం విజయవంతంగా ముగిసిన అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.








