
గుంటూరు, అక్టోబర్ 17 : ఇంజనీరింగ్ కళాశాలలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో “జనరేటివ్ ఎఐ” అంశంపై ఒకదిన శిక్షణా శిబిరంను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ వై. సురేష్ కుమార్ ఒక పత్రికా ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. chalapathi institute of engineering and technologyచలపతి ఇంజినీరింగ్ కాలేజీలో టెక్ ఫెస్ట్ ఘనంగా ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా డా. సాగర్ ఇమాంచి, ప్రొఫెసర్, పీ.ఎస్.ఇ. కె.యల్ యూనివర్సిటీ నుండి విచ్చేసి, మారుతున్న సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రత్యేకంగా జనరేటివ్ ఎఐ ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులు జనరేటివ్ ఎఐలో ఉన్న అపార అవకాశాలను వినియోగించుకొని కొత్త సాంకేతిక సవాళ్లను పరిష్కరించాలని సూచించారు.

కళాశాల ప్రిన్సిపల్ డా. ఎం. చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ, నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులలో ఎఐపై అవగాహన పెరుగుతోందని, భారతీయ భాషల పరంగా క్రియేటివ్ ఇకోసిస్టంను విస్తరించేందుకు జనరేటివ్ ఎఐ గొప్ప వేదికగా మారుతుందని అన్నారు. విద్యార్థులు స్వీయ అభివృద్ధికి తగిన ఎఐ మోడల్స్‌ను రూపొందించి మెరుగైన ఉపాధి అవకాశాలను సాధించాలన్నారు.
కళాశాల యాజమాన్యం ఎల్లప్పుడూ విద్యార్థులకు మరియు అధ్యాపకులకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తుందని ఆయన తెలిపారు.
కార్యక్రమాన్ని సి.ఎస్.ఈ విభాగాధిపతి డా. ఎ. బాలాజీ సమన్వయం చేశారు. ఈ శిబిరంలో విభాగంలోని ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, అధ్యాపకులు మరియు సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.







