
అవార్డు అందజేసిన బర్లింగ్టన్ యూనివర్సిటీ, వెర్మాంట్ – అమెరికా
గుంటూరు:మరియు సామాజిక సేవా రంగంలో విశేష సేవలు అందిస్తున్న చలపతి విద్యా సంస్థల అధినేత యలమంచిలి వీరాంజనేయులు (చలపతి ఆంజనేయులు) కు అమెరికా బర్లింగ్టన్ విశ్వవిద్యాలయం, వెర్మాంట్ ద్వారా గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయబడింది.
గత మూడు దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల విద్యాభివృద్ధే లక్ష్యంగా, సామాజిక సేవే పరమావధిగా కె జి నుంచి పి జి వరకు (స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు) విద్యా సేవలను విస్తరించినందుకు ఈ గౌరవం లభించింది.
గౌరవ డాక్టరేట్ అనేది సమాజానికి విశిష్ట సేవలు చేసిన, ప్రజలకు ఆదర్శమైన వ్యక్తులకు అందించే ప్రథమ గౌరవం. విద్యా రంగం మాత్రమే కాదు, వైద్య సేవలు, పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఉచిత మెగా వైద్య శిబిరాలు, అవసరమైన వారికి ఆర్థిక సహాయం, దేవాలయాల నిర్మాణానికి మద్దతు, అలాగే యలమంచిలి ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ చలపతి ఆంజనేయులు ప్రజాహిత కర్తగా గుర్తింపు పొందారు.
ఈ సందర్భంలో మాట్లాడిన వై.వి. ఆంజనేయులు మాట్లాడుతూ,
“ఈ గౌరవం నాకు మాత్రమే కాదు, చలపతి విద్యా సంస్థల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులందరికీ దక్కిన గుర్తింపు. ఈ నమ్మకానికి తగ్గట్టు ఆగమేఘాల మీద మరింత సేవలు అందిస్తాం” అని తెలిపారు.
అవార్డు అందుకున్న సందర్భంగా చలపతి విద్యా సంస్థల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.







