దేశ రాజధాని ఢిల్లీ నుండి తక్కువ ధరలకు లభిస్తున్న పాత వాహనాలు ఇప్పుడు హైదరాబాద్ వాసులను ఆకర్షిస్తున్నాయి.
ఒకప్పుడు రూ.50 లక్షలు ఖరీదైన కార్లు కేవలం రూ.15 లక్షలకు, రూ.20 లక్షల విలువైన కార్లు కేవలం రూ.3 లక్షలకు లభిస్తున్నాయని విస్తృత ప్రచారం జరుగుతోంది.
కార్లను తక్కువ ధరకే పొందాలన్న ఆకర్షణతో హైదరాబాద్ ప్రజలు వీటిని కొనుగోలు చేస్తున్నారు.
ఎందుకు తక్కువ ధరలకి ఇవి వస్తున్నాయి?
ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చట్టాలు కఠినంగా అమలవుతున్నాయి.
ఏ చిన్న ఉల్లంఘనకు కేసులు పెడుతున్నారు.
తీర్మానం: పాత వాహనాలను తక్కువ ధరలకు వదులుకోవడమే బెస్ట్ అని ఢిల్లీ వాసులు నిర్ణయించుకుంటున్నారు.
ఇలా 62 లక్షల పైగా పాత వాహనాలు అమ్మకానికి రావడం వల్ల ఇతర రాష్ట్రాల వ్యాపారులు, వ్యక్తులు వాటిని తీసుకువెళుతున్నారు.
కానీ వీటివల్ల Hyderabad కు వచ్చే సమస్య ఏంటి?
పాత వాహనాలు పర్యావరణానికి హానికరమైనవి.
కిలోమీటరుకు 150–350 గ్రాములు కార్బన్ డయాక్సైడ్, 1–10 గ్రాములు కార్బన్ మోనాక్సైడ్, 0.5–8 గ్రాములు నైట్రస్ ఆక్సైడ్, 0.1–0.5 గ్రాముల ధూళికణాలను విడుదల చేస్తాయి.
కొత్త బీఎస్-6 వాహనాలతో పోలిస్తే 20–50% ఎక్కువ కాలుష్యం వీటివల్ల వస్తుంది.
ప్రస్తుతం Hyderabad లో పరిస్థితి:
భాగ్యనగరంలో 80 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి.
ఇందులో సుమారు 25 లక్షల వాహనాలు కాలం చెల్లినవి.
వీటిలో 17 లక్షల బైకులు, 3.5 లక్షల కార్లు, 1 లక్ష సరకు రవాణా వాహనాలు, 25 వేలు ఆటోలు, 2500 బస్సులు ఉన్నాయి.
గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు తక్కువ ధరలకి వీటిని కొనుగోలు చేస్తున్నారు.
తక్కువ ధరలో కారు వస్తుందనే కారణంతో తీసుకుంటున్నా, దీని ప్రభావం నగర వాయు నాణ్యతపై పడుతోంది.
చట్టం ఏమంటుంది?
భారత మోటారు వాహన చట్టం ప్రకారం:
✅ 15 ఏళ్లు దాటిన వాహనాలు గ్రీన్ టాక్స్ చెల్లించి 5 ఏళ్లు వరకు పునరుద్ధరించుకోవచ్చు.
✅ 20 ఏళ్లు దాటిన వాహనాలకూ రీ-రిజిస్ట్రేషన్ అవకాశం ఉంది.
✅ స్క్రాప్ చేసి కొత్త వాహనాన్ని కొంటే లైఫ్ ట్యాక్స్ లో రాయితీ లభిస్తుంది.
కానీ: ఈ స్క్రాప్ పాలసీపై సరైన అవగాహన లేకపోవడం