
Guntur:చెరుకుపల్లి:30-11-25:- మండలం ఆరుంబాక గ్రామం సమీపంలో రహదారి పక్కన గుర్తు తెలియని యువకుడి మృతదేహం కనిపించడం స్థానికులను కలవరపరిచింది. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న గ్రామస్తులు, మృతదేహం **బచ్చు సాయి (32)**గా గుర్తించారు.
బచ్చు సాయి చెరుకుపల్లి బ్యాంక్ ఆఫ్ ఇండియా బజార్లోని సాయి ఫ్యాన్సీ షాప్ నిర్వాహకుడి కుమారుడు. పురుగుమందు సేవించడంతో మృతి సంభవించి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.వెంటనే సమాచారం అందుకున్న చెరుకుపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, మృతుడి మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.యువకుడి మృతి ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది.







