
బాపట్ల: పర్చూరు: చిన్నగంజాం :23-10-25:-బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మండలంలోని పలు గ్రామాల్లో పరిస్థితి దారుణంగా మారింది. గ్రామాల్లోని సిమెంట్ రోడ్లు చెరువులను తలపించేలా వర్షపు నీటితో నిండిపోయాయి. ఫలితంగా వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నిత్యం రద్దీగా ఉండే రైల్వే గేట్ సెంటర్, బస్టాండ్ పరిసరాల్లో నీటి నిల్వ కారణంగా ప్రయాణికులు ఇరుక్కుపోయి ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు సరిగా వెళ్లిపోకపోవడంతో ప్రజలు అసహనంగా మారారు. స్థానికులు త్వరితగతిన నీటిని తొలగించి, డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులు కోరుతున్నారు







