
ఈనెల 26, 27 తేదీల్లో గుంటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. రాష్ట్ర హోంశాఖ ఆధ్వర్యంలో
గురువారం యాంటీ నార్కోటిక్ దినోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర హోం మంత్రి అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మీడియాతో మాట్లాడారు.
అమరావతి రోడ్డు ఫీవర్ ఆసుపత్రి నుంచి చిల్లీస్ సెంటర్ వరకు యాంటీ నార్కోటిక్ ర్యాలీ జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా
శ్రీ కన్వెన్షన్ లో యువత, విద్యార్థులతో మాదక ద్రవ్యాల వినియోగంపై సదస్సు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గంజాయిపై కూటమి ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుందని స్పష్టం చేశారు. ఈగల్ టీం ఏర్పాటు చేసి గంజాయి రవాణా, వాడకం అడ్డుకుంటున్నాని హోం మంత్రి అనిత ప్రకటించారు.







