కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ వర్ధంతి.
పల్నాడు జిల్లా,చిలకలూరిపేట
సత్యం అహింస సత్యాగ్రహాలతో కూడిన గాంధీ ఇజమా వర్ధిల్లు అశాంతి అసహనం తీవ్రవాదాల ప్రతీక యైన గాడ్సే ఇజాన్ని దేశం నుంచి తరిమి కొట్టు అని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బేతంచర్ల రామ కోటేశ్వరరావు కళాశాల రిటైర్డ్ లెక్చరర్ తోకల సాంబశివరావులు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎం రాధాకృష్ణ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బేతంచర్ల రామకోటేశ్వర రావు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్త కోటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు గుర్రం సాంబశివరావు, సామా హనుమాన్, శ్రీనివాసరావులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బేతంచర్ల రామకోటేశ్వరరావు రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ నసురుద్దీన్ పల్నాడు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చే రెడ్డి శ్రీరామ్ రెడ్డి, విశ్రాంత లెక్చరర్ తోకల సాంబశివరావు, పల్నాడు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇంటూరి భవాని వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకర హరిబాబు ,మిరియాల వెంకటరత్నం దాసరి శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు.