Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
Trending

చైల్డ్ ఆర్టిస్టు రవి రాథోడ్ జీవితంలో లారెన్స్ మళ్లీ ఆశ చూపించాడు||Child Artist Ravi Rathod’s Life Gets a Ray of Hope Again with Lawrence’s Help

Child Artist Ravi Rathod’s Life Gets a Ray of Hope Again with Lawrence’s Help

విక్రమార్కుడు, ఆంధ్రావాలా, ఖడ్గం, జెమిని, మాస్, బొమ్మరిల్లు, డాన్, హైదరాబాద్ నవాబు, శంకర్‌దాదా ఎంబీబీఎస్ వంటి 25కు పైగా సూపర్‌హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అందరినీ అలరించిన రవి రాథోడ్ జీవితం అనుకోని మలుపులు తిరిగింది.

చిన్న వయసులో తల్లిదండ్రులను కోల్పోయిన రవి రోడ్డుపై జీవనకృషి చేయాల్సిన పరిస్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న హీరో రాఘవ లారెన్స్, రవిని దత్తత తీసుకుని చదివించాలని చూసి మంచి స్కూల్‌లో చేర్పించగా, రవి మధ్యలోనే స్కూల్ నుంచి పారిపోయి తిరిగి రోడ్డు జీవితంలోకి వెళ్ళాడు. చిన్నచితకా పనులు చేస్తూ, తాగుడుకు బానిసైపోయి, ఒక దశలో ‘మందు లేకుండా బతకలేను’ అన్న స్థితికి చేరుకున్నాడు.

ఒక యూట్యూబర్ రోడ్డుపై తిరుగుతున్న రవిని గుర్తించి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, ఈ మాజీ చైల్డ్ ఆర్టిస్ట్ స్థితి అందరికీ తెలిసింది. ఒక ఇంటర్వ్యూలో ‘లారెన్స్ మాస్టర్ ను కలవలేకపోయావా?’ అన్న ప్రశ్నకు, ‘భయంగా ఉంది, ఎందుకు పారిపోయావని తిడతాడేమో, కొడతాడేమో’ అని రవి సమాధానం ఇచ్చాడు.

లారెన్స్ స్పందన:

ఈ విషయం తెలుసుకున్న లారెన్స్ ‘నిన్ను తిట్టను, కొట్టను.. ఒక్కసారి వచ్చి కలువురా’ అంటూ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.

చెన్నైకి వెళ్లిన రవి:

ఆ పోస్ట్ చూసిన రవి రాథోడ్ చెన్నైకి వెళ్లి లారెన్స్ ను కలిశాడు. తన పరిస్థితిని చూసి లారెన్స్ చలించిపోయారు. ప్రథమంగా లారెన్స్ ‘నీలా తాగేవాళ్లకు సపోర్ట్ చేయను. నువ్వు చిన్నప్పటి నుంచి పరిచయమే కావడంతో సహాయం చేస్తున్నా’ అని చెప్పారు.

సహాయం, సపోర్ట్:

• లారెన్స్ రవికి ₹50,000 ఆర్థిక సాయం చేశారు.
ఆల్కహాల్ అడిక్షన్ తగ్గించేందుకు అన్ని మెడికల్ టెస్టులు చేయించి, మందులు ఇచ్చారు.
• ‘మెడిసిన్ వాడుతున్నప్పుడు మళ్లీ తాగితే ప్రాణాలకు ముప్పు’ అని డాక్టర్లు హెచ్చరించడంతో రవిని తాగడం మానేశాడు.

రవిప్రకారం:

‘లారెన్స్ మాస్టర్ చెన్నైలోనే ఉండమన్నారు. కానీ ఫ్రెండ్స్ Hyderabad వస్తున్నారంటూ వారితో కలిసి తిరిగి వచ్చేశాను. మాస్టర్ ఇచ్చిన డబ్బుతో కొత్త మొబైల్ కొనుక్కున్నాను. ఇప్పుడు తాగడం మానేశాను’ అని రవి రాథోడ్ చెప్పాడు.

Authors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button