
జగ్గయ్యపేట, నవంబర్ 7 :-ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ (గ్రీవెన్స్ సెల్) కార్యక్రమంలో ప్రజల అర్జీలను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురామ్.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే తాతయ్య, తక్షణమే పరిష్కారానికి సంబంధిత శాఖాధికారులతో చర్చించి అవసరమైన సూచనలు జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రాధాన్యమని, ప్రతి అర్జీపై పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నితిన్, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ కో కన్వీనర్ ముల్లంగి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి కొఠారు సత్యనారాయణ ప్రసాద్, మండల టిడిపి అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.







