
రూ.150 కోట్ల మహిళా రుణాల పంపిణీ.. మెగా కంటి వైద్య శిబిరం – ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
చిన్నగంజాం (బాపట్ల జిల్లా): పల్లె మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా, మహిళా సాధికారతే లక్ష్యంగా చిన్నగంజాం వేదికగా ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10:30 గంటలకు స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
ప్రధాన కార్యక్రమాలు ఇవే:
- మెగా కంటి వైద్య శిబిరం: ఏలూరి చారిటబుల్ ట్రస్ట్, నోవా అగ్రి గ్రూప్, గ్రీన్స్ పార్క్ ఫౌండేషన్ మరియు శంకర కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు, శస్త్రచికిత్స సదుపాయం కల్పిస్తారు.
- భారీ రుణాల పంపిణీ: మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.150 కోట్ల రుణాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు.
- ఉపాధి భరోసా: లబ్ధిదారులకు సబ్సిడీపై కార్లు, టెంట్ హౌస్ సామాగ్రి అందజేయడంతో పాటు, మరికొందరికి ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులను పంపిణీ చేస్తారు.
- విద్యార్థులతో ముచ్చట: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించి, వారి భవిష్యత్ లక్ష్యాలపై మార్గదర్శనం చేయనున్నారు.
- ప్రత్యక్ష ప్రసారం: మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చేసే ప్రసంగాన్ని తిలకించేందుకు సభ ప్రాంగణంలో భారీ ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మహిళా సత్కారం – స్టాల్స్ ఏర్పాటు:
వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను ఈ వేదికపై ఎమ్మెల్యే సన్మానించనున్నారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఐసిడిఎస్ (ICDS), డిఆర్డిఏ (DRDA) శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.
ఏర్పాట్ల పరిశీలన:
కార్యక్రమానికి భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉండటంతో టీడీపీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. శనివారం హైస్కూల్ ప్రాంగణంలోని ఏర్పాట్లను మండల నేతలు పోదా వీరయ్య, నక్కల రాఘవ, సయ్యద్ ఆజాద్, రాయని ఆత్మ రావు, ఐసిడిఎస్ సీడీపీఓ సులోచన, ఎస్ఐ రమేష్ తదితరులు పరిశీలించారు. భక్తులకు, భోజన సౌకర్యాలకు ఇబ్బంది కలగకుండా తగిన సూచనలు చేశారు.bapatla news







