
చిన్నగంజాం: ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి వేళ ఓ వ్యక్తిపై దాడి జరగడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలుకు చెందిన పూనూరు పవన్ కుమార్ అనే వ్యక్తి తన కారు (నెంబరు: AP40CA3200) లో వెళ్తుండగా, మార్చి 19వ తేదీ అర్ధరాత్రి సుమారు 1:00 గంట సమయంలో చిన్నగంజాం మండలం కడవకుదురు రైల్వే గేటు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సోపిరాల గ్రామానికి చెందిన కోటేశ్వరరావు, సన్నీ, వాసు మరియు మరికొంతమంది వ్యక్తులు కలిసి పవన్ కుమార్ కారును అడ్డుకుని, దానిని తీవ్రంగా ధ్వంసం చేశారు. అంతేకాకుండా బాధితుడిని చంపేస్తామంటూ ప్రాణహాని కలిగించేలా బెదిరింపులకు దిగారు. బాధితుడు పవన్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్నగంజాం ఎస్సై శ్రీ ఎస్.రమేష్ గారు కేసు నమోదు చేశారు. ఈ దాడికి గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.http://BAPATLA NEWS







