chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :చినగంజాంలో విద్యార్థులకు శక్తి బృందం ప్రత్యేక అవగాహన కార్యక్రమం

బాపట్ల జిల్లా:- ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మోయిన్ గారి సూచనలతో చినగంజాం మండలం జడ్పీహెచ్‌ఎస్ పెద్ద పల్లెపాలెం పాఠశాలలో సోమవారం విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Bapatla Local News :చినగంజాంలో విద్యార్థులకు శక్తి బృందం ప్రత్యేక అవగాహన కార్యక్రమం

ఈ కార్యక్రమాన్ని చినగంజాం ఎస్ఐ రమేష్ గారి ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం నిర్వహించింది. శక్తి బృందం ఎస్సై ఏ.హరి బాబు గారు, కానిస్టేబుల్ కే.సుబ్బారావు గారు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శక్తి బృందం ఎస్సై ఏ.హరి బాబు గారు మాట్లాడుతూ శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు తక్షణ సహాయం పొందేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈవ్ టీజింగ్, బాల్య వివాహాల నివారణలో కూడా శక్తి యాప్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

Bapatla Local News :చినగంజాంలో విద్యార్థులకు శక్తి బృందం ప్రత్యేక అవగాహన కార్యక్రమం

విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంశాలపై అవగాహన కల్పిస్తూ, ఎవరి వల్లైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులకు లేదా పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలలో వచ్చే ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమస్య ఎదురైనప్పుడు 100, 112 హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేస్తే తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అలాగే గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వలన కలిగే దుష్పరిణామాలను వివరించారు. డ్రగ్స్ లేదా గంజాయికి సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే 1972 ఫోన్ నంబర్‌కు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు.Chirala Local News

ఈ కార్యక్రమంలో శక్తి టీం ఎస్సై ఏ.హరి బాబు గారు, పీసీ కే.సుబ్బారావు గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగాల వెంకటేశ్వర్లు గారు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker