chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్అమరావతి📍కృష్ణా జిల్లా

Gudivada Local News:చింతలపూడిలో ఆర్టీసీ బస్ డిపోకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ కృషి

అమరావతి, శుక్రవారం:– చింతలపూడిలో ఆర్టీసీ బస్సు డిపో మంజూరు చేయాలని రోషన్ కుమార్ రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇన్‌చార్జి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.టి. కృష్ణ బాబును సచివాలయంలో కలసి విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ చింతలపూడి రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న మారుమూల ప్రాంతమని, సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వైద్య సేవల కోసం పట్టణాలకు వెళ్లే ప్రజలు రాకపోకల విషయంలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని ఆయన ఎండీ దృష్టికి తీసుకువచ్చారు.

చింతలపూడిలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేస్తే పరిసర గ్రామాలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి రావడంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.Gudivada news

వినతి పత్రాన్ని పరిశీలించిన ఎండీ ఎం.టి. కృష్ణ బాబు సమస్య ప్రాముఖ్యతను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

చింతలపూడి ప్రజల దీర్ఘకాలిక డిమాండ్‌గా ఉన్న బస్ డిపో ఏర్పాటు దిశగా ప్రభుత్వం ముందడుగు వేయాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker