
Eluru:చింతలపూడి, అక్టోబర్ 21:పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా చింతలపూడి పట్టణంలో ర్యాలీ ఘనంగా నిర్వహించారు.
స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ ఆధ్వర్యంలో, ఎస్సై సతీష్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమర పోలీసులను స్మరించుకుంటూ ర్యాలీ చింతలపూడి ప్రధాన వీధుల గుండా సాగింది. ప్రజల్లో పోలీసుల సేవల ప్రాముఖ్యత, త్యాగాలపై అవగాహన పెంచడమే ఈ ర్యాలీ లక్ష్యమని అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు పోలీస్ కమేమరేషన్ డే చరిత్రను వివరించారు. దేశ సరిహద్దుల్లో, అంతర్గత భద్రత పరిరక్షణలో, అలాగే ప్రకృతి వైపరీత్యాల సమయంలో పోలీసుల త్యాగస్ఫూర్తిని గుర్తు చేశారు.
“పోలీసులు కేవలం చట్టాన్ని అమలు చేసే వారే కాదు, ప్రజల మిత్రులు కూడా” అని అధికారులు పేర్కొన్నారు. డయల్ 112 వంటి అత్యవసర సేవల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు.ర్యాలీ ముగింపులో ప్రజలు పోలీసుల సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను స్మరించారు.







