chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Chirala Local News :చీరాల అభివృద్ధిపై ‘బులుగు’ విష ప్రచారం-బీసీ ఎమ్మెల్యే టార్గెట్‌గా కుట్రలు

చీరాల, ఫిబ్రవరి: చీరాల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష వైసీపీ నేతలు బులుగు పత్రికను అడ్డం పెట్టుకొని అడ్డగోలు విమర్శలకు దిగుతున్నారని కూటమి శ్రేణులు ధ్వజమెత్తాయి. బుధవారం పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో సాక్షి పత్రిక ప్రతులను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కొండయ్య గారిపై కావాలనే తప్పుడు కథనాలు వండివారుస్తున్నారని, ఇలాగే కొనసాగితే తెలుగు తమ్ముళ్ల దెబ్బ రుచి చూడక తప్పదని హెచ్చరించారు.

ఏది నిజం? ఆర్‌ఓబీ (ROB) ఆలస్యానికి కారణమెవరు?

గత రెండు రోజులుగా బులుగు పత్రికలో ఆర్‌ఓబీ నిర్మాణం ఎమ్మెల్యే వల్లే ఆగిపోయిందన్న వార్తలపై వాస్తవాలు ఇలా ఉన్నాయి:

  • 2014-19: టీడీపీ హయాంలోనే బ్రిడ్జికి అనుమతులు వచ్చి, షాపుల తొలగింపు కూడా పూర్తయ్యింది.
  • 2019-24: గత వైసీపీ ఎమ్మెల్యే హయాంలో ఈ ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురై, వేరే ప్రాంతానికి తరలిపోయింది.
  • ప్రస్తుతం: ఎమ్మెల్యే కొండయ్య గెలిచిన వెంటనే ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తి, నిధుల సాధన కోసం కృషి చేస్తున్నారు. తన తప్పు ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతోనే వైసీపీ ముఖ్య నేత తన ‘చెంచా’ విలేకరితో తప్పుడు వార్తలు రాపిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.Bapatla Local News

బీసీ నేత ఎదుగుదలపై అగ్రవర్ణ అహంకారం!

చీరాల చరిత్రలో ప్రగడ కోటయ్య గారి తర్వాత, ఆ స్థాయిలో అసెంబ్లీలో ప్రజల గొంతుకను వినిపిస్తున్న నాయకుడు కొండయ్య గారేనని ప్రజలు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా చేనేత కార్మికుల సమస్యలపై ఆయన పోరాటం చూసి వైసీపీ నేతలకు నిద్రపట్టడం లేదు. ఒక బీసీ నాయకుడు ‘ఏ ప్లస్’ గ్రేడ్ పాలన అందించడాన్ని జీర్ణించుకోలేక, సామాజిక వర్గ సమీకరణాలను అడ్డం పెట్టుకొని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని కూటమి నేతలు మండిపడ్డారు.

బ్లాక్ మెయిల్ విలేకరి.. తోడు దొంగల ముఠా!

ప్రస్తుతం ఆ పత్రికలో వార్తలు రాస్తున్న వ్యక్తిపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

“గతంలో అనేక ప్రముఖ పత్రికల నుంచి అవినీతి, వసూళ్ల కారణంతో ఇతనిని బహిష్కరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను, సినిమా థియేటర్ల యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేయడం ఇతనికి అలవాటు. ఎమ్మెల్యే కొండయ్య గారు ఇతని అవినీతికి సహకరించకపోవడంతోనే, తన యజమాని డైరెక్షన్‌లో విషం చిమ్ముతున్నాడు.”

అవినీతికి మారుపేరైన వ్యక్తిని, ఓటమి భయంతో ఉన్న నేతను కలిపి చీరాల ప్రజలు ‘తోడు దొంగలు’గా అభివర్ణిస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే బీసీలంతా ఏకమై బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker