
చీరాల:-చీరాల పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన హిందూ సమ్మేళనం ఘనంగా, అత్యంత విజయవంతంగా ముగిసింది. ఈ సమ్మేళనానికి 5,000కు పైగా హిందూ కుటుంబాల సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయడం విశేషం.

హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాల పరిరక్షణే లక్ష్యంగా హిందూ చైతన్య వేదిక – చీరాల ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం నిర్వహించబడింది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో బాయ్స్ హై స్కూల్ ఆవరణ కిక్కిరిసిపోయింది. వేదికపై హిందూ ధర్మ పరిరక్షణ, సమాజ ఐక్యత, యువతలో సంస్కార విలువల పెంపు వంటి అంశాలపై ప్రముఖులు ప్రసంగించారు.

ఈ సందర్భంగా హిందూ చైతన్య వేదిక చీరాల కన్వీనర్ డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ,
“హిందూ సమాజాన్ని ఒకే వేదికపై ఐక్యం చేయడమే ఈ సమ్మేళనం ముఖ్య ఉద్దేశ్యం. ప్రజల నుంచి వచ్చిన స్పందన మా అంచనాలకు మించినది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క హిందూ కుటుంబ సభ్యులకు, స్వచ్ఛంద సేవకులకు, నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని అన్నారు.Chirala Local News
కార్యక్రమం మొత్తం శాంతియుతంగా, క్రమబద్ధంగా సాగిందని నిర్వాహకులు తెలిపారు. మహిళలు, యువత, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని హిందూ సమ్మేళనానికి విశేష మద్దతు పలికారు. భక్తి గీతాలు, ధార్మిక నినాదాలతో వాతావరణం ఆధ్యాత్మికంగా మారింది.

ఈ హిందూ సమ్మేళనం చీరాల పట్టణంలో హిందూ సమాజ ఐక్యతకు ప్రతీకగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని హిందూ చైతన్య వేదిక నాయకులు తెలిపారు.







