
Chirala:21-11-25:-చీరాల క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రజా దర్బార్ నిర్వహించారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ అర్జీలను ఎమ్మెల్యేకు అందజేశారు. అందిన ప్రతి వినతిని సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కారం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ ప్రజా దర్బార్‌లో మొత్తం 155 అర్జీలు స్వీకరించగా—25 పెన్షన్‌కు,110 ఇళ్ల స్థలాల మంజూరుకు,20 ఇతర సమస్యలకు సంబంధించినవిగా అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో చీరాల మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, జనసేన నాయకులు గూడూరు శివరాం ప్రసాద్, చీరాల మున్సిపల్ కౌన్సిలర్ గోలి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.







