
చీరాల: డిసెంబర్ :-బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ పి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మొయిన్ సూచనలతో చీరాల 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురంలో ఉన్న ఎమ్మెస్సార్ స్పోర్ట్స్ అకాడమీ లో శక్తి బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అకాడమీకి చెందిన విద్యార్థులు, యువతకు శక్తి యాప్ ఉపయోగాలు, ప్రాముఖ్యతపై శక్తి బృందం సభ్యులు వివరించారు. మహిళలు, బాలికల భద్రతకు శక్తి యాప్ ఎలా ఉపయోగపడుతుందో ప్రాయోగికంగా తెలియజేశారు. అదనంగా పోక్సో చట్టం, రహదారి భద్రత, ఆరోగ్య సంరక్షణ, మంచి అలవాట్లు, సానుకూల ఆలోచన, సాధారణ జ్ఞానం, అలాగే కష్టపడి పని చేస్తే ఎలా విజయాన్ని సాధించవచ్చో వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.

యువతలో భద్రతా చైతన్యం పెంపొందించడం, నైతిక విలువలు అలవర్చడం, ఆరోగ్యకర జీవన విధానంపై అవగాహన తీసుకురావడమే ఈ కార్యక్రమ లక్ష్యమని శక్తి బృందం సభ్యులు తెలిపారు.Bapatla Local News
ఈ కార్యక్రమంలో శక్తి టీం ఇన్చార్జ్ ఎస్సై హరిబాబు, కానిస్టేబుల్ కె. సుబ్బారావు పాల్గొని విద్యార్థులకు సూచనలు అందించారు.










