
చీరాల, ఫిబ్రవరి 2 (2026):-చీరాలలోని సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో జె.ఎన్.టి.యు కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్ కాలేజ్ పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ మరియు బాడీ బిల్డింగ్ టోర్నమెంట్‌ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌తో పాటు యూనివర్సిటీ టీం సెలక్షన్స్ కూడా నిర్వహిస్తున్నారు.

పవర్ లిఫ్టింగ్ (పురుషులు, స్త్రీలు), వెయిట్ లిఫ్టింగ్ (పురుషులు, స్త్రీలు) మరియు బాడీ బిల్డింగ్ (పురుషులు) విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయి. కార్యక్రమాన్ని కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. జగదీశ్ బాబు మాట్లాడుతూ, శారీరక ఆరోగ్యం మెరుగుపడితే మానసిక ఆరోగ్యం కూడా బలపడుతుందని తెలిపారు. క్రీడలు విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి కీలకంగా నిలుస్తాయని అన్నారు.
ప్రధాన అతిథిగా హాజరైన వేటపాలెం సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. జనార్ధన్ మాట్లాడుతూ, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలని సూచించారు. పవర్ లిఫ్టింగ్ వంటి క్రీడలు శరీర దృఢత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ఈ టోర్నమెంట్‌కు జె.ఎన్.టి.యు కాకినాడ పరిధిలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. పాల్గొన్న క్రీడాకారులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించినట్లు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయుడు, జె.ఎన్.టి.యు.కె స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యుడు అన్నం శ్రీనివాసరావు తెలిపారు.
జె.ఎన్.టి.యు.కె స్పోర్ట్స్ కౌన్సిల్ తరఫున డా. శ్యాం కుమార్ పరిశీలకులుగా హాజరయ్యారని వెల్లడించారు.Chirala Local News
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డా. సి. సుబ్బారావు (అక్రిడిటేషన్), డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) వనమా దొర నాగ సాయినాద్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్.వి. రమణమూర్తి, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.










