
Bapatla:చీరాల: 26-11-2025:-బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మోయిన్ గారి పర్యవేక్షణలో చీరాల పట్టణంలోని రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ ఎస్. సుబ్బారావు, ఉమెన్ ఎస్‌ఐ జి. రాజ్యలక్ష్మి, చీరాల సబ్‌డివిజన్ శక్తి బృందానికి చెందిన ఎస్‌ఐ ఏ. హరి బాబు, కానిస్టేబుల్ కే. సుబ్బారావు, పిసి సునీత, ధనలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ సుబ్బారావు గారు, శక్తి బృందం ఎస్సై హరి బాబు గారు విద్యార్థులకు శక్తి యాప్ ఉపయోగాలు వివరించారు. అత్యవసర సమయాల్లో మహిళలకు తక్షణ సహాయం అందించడంలో ఈ యాప్ ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. ఈవ్‌టీజింగ్, బాల్యవివాహాలు వంటి సమస్యలను నివారించడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.అలాగే గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే తల్లిదండ్రులకు లేదా గురువులకు తెలియజేయాలని సూచించారు.రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో వచ్చే ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్ నెంబర్లు 100, 112 కు కాల్ చేస్తే వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఐ సుబ్బారావు, హెడ్ కానిస్టేబుల్ రామారావు, శక్తి బృంద సభ్యులు, స్కూల్ హెడ్‌మాస్టర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.







