
చీరాల;- పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చీరాల ఎమ్మెల్యే శ్రీ ఎం.ఎం. కొండయ్య యాదవ్ గారు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ గారు మాట్లాడుతూ, రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలంటే ఇప్పటి నుంచే ప్రతి గ్రామం, ప్రతి వార్డు స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి కమిటీ, ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు చురుకుగా పనిచేస్తూ ప్రజల మధ్య ఉండాలని సూచించారు. ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

పార్టీ కార్యక్రమాలు ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరేలా క్షేత్రస్థాయిలో చురుకైన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇకపై పార్టీ క్రమశిక్షణ, ఐక్యతను తప్పనిసరిగా పాటించాలని, అంతర్గత విభేదాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వకుండా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని హితవు పలికారు.యువత, మహిళల పాత్రను మరింత పెంచుతూ పార్టీ కార్యక్రమాల్లో వారిని చురుకైన భాగస్వాములుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే సూచించారు.Chirala Local News చీరాల అభివృద్ధి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు.ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, మండల, పట్టణ అధ్యక్షులు, వార్డు ఇన్‌చార్జీలు, బూత్ స్థాయి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.







