
చీరాల:25-11-25:- నియోజకవర్గ స్థాయిలో జెండర్ వివక్షత నిర్మూలనకు నయీ చేతన్ 4.0 కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు, AMC చైర్మన్ కౌత్రపు జనార్ధన్ రావు గారు కలిసి చీరాల–వేటపాలెం మండల సమైక్య సభ్యుల సమక్షంలో ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు.

నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రతి మహిళను చేరుకునేలా జెండర్ వివక్షతకు వ్యతిరేకంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
స్త్రీ–పురుష సమానత్వం సమాజ అభివృద్ధికి మూలస్తంభమని పేర్కొంటూ, మహిళలు నేటి రోజుల్లో శాస్త్ర–సాంకేతిక రంగం సహా అన్ని విభాగాల్లో ముందంజలో ఉన్నారని గుర్తుచేశారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం లింగ సమానత్వానికి ప్రభుత్వం తీసుకున్న కీలక అడుగు అని ఆయన పేర్కొన్నారు.కార్యक्रमంలో గౌ. జి. స్నేహ (చీరాల బార్ అసోసియేషన్), చీరాల మండలం APM కడెం మధుసూదన్ రావు, వేటపాలెం మండలం APM కే. అంజిబాబు, అలాగే సిసి బుజ్జి, కవిత, వేణు, వివోఏలు పాల్గొన్నారు.







