
చీరాల:- చీరాల పట్టణంలోని బోస్ నగర్లో ఉన్న శ్రీ రేణుకా దేవి అమ్మవారి 35వ వార్షికోత్సవ తిరునాళ్ల కార్యక్రమం శుక్రవారం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ఉత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ఆమంచి అభినందించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.Chirala Local News
కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
I prefer this response







