
చీరాల, అక్టోబర్ 14:సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, చీరాలలో “ఎమోషనల్ డిటెక్షన్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్” అంశంపై ప్రత్యేక నిపుణుల అభిప్రాయ కార్యక్రమం శనివారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించబడింది. ఈ విషయాన్ని కళాశాల కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఐటి వరంగల్ ప్రొఫెసర్ డా. టి. కిషోర్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులతో తన అనుభవాలను పంచుకున్నారు. “మనిషి భావోద్వేగాలను అర్థం చేసుకునే దిశగా ఏఐ పయనిస్తోంది. ఇది హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, సెక్యూరిటీ మరియు సోషల్ ఇంటరాక్షన్ వంటి కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది,” అని ఆయన పేర్కొన్నారు.కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. జగదీష్ బాబు మాట్లాడుతూ, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో బి.టెక్ నాలుగవ సంవత్సరం విద్యార్థులకు ఈ సదస్సు నిర్వహించబడిందని తెలిపారు. విద్యార్థులలో పరిశోధనాభిలాషను పెంపొందించేందుకు, పరిశ్రమ అవసరాలను అర్థం చేసుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని చెప్పారు.






